MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, April 21, 2014

ఎవరెటో తేల్చేయండి!

- 30లోగా ఉద్యోగుల జాబితాలు  - 'విభజన'పై 90 మార్గదర్శకాలు జారీ  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
విభజన అనంతరం ఉద్యోగస్తులు ఏ రాష్ట్ర ప్రభుత్వం కిందకు వస్తారో నిర్ధారిస్తూ జాబితాలు సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల అధిపతులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి నుంచి ఈ ఆదేశాలు
జారీ అయ్యాయి. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన తాత్కాలిక జాబితాలను సిద్దం చేసి ఈ నెల 30వ తేదిలోగా ఆర్థికశాఖతో పాటు, సాధారణ పరిపాలన శాఖకు అందించాలని ఈ ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనతో పాటు విభజన నేపధ్యంలో కీలకమైన వివిధ ఇతర అంశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలను వివరిస్తూ 90 మార్గదర్శకాలను కూడా ఆయన జారీ చేశారు. ఈ మేరకు అంతర్గత సర్య్యులర్‌ను విడుదల చేశారు. ఆరు పేజీలున్న ఈ సర్క్యులర్‌లో నగదు నిల్వలు, స్థిర, చరాస్తులు, సరిహద్దుల నిర్ధారణ, భవనాల కేటాయింపు, ఫైళ్లు, ఐటి రంగం వంటి వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటికి ఈ నెల 30 వ తేదినే డెడ్‌లైన్‌గా నిర్ధారించారు. ఈ ప్రక్రియ అధికారులు ఎప్పటికప్పుడు పురోగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. 
వివిధ అంశాలపై ప్రభుత్వప్రధాన కార్యదర్శి జారీ చేసిన మార్గదర్శకాలు క్లుప్తంగా :
ఉద్యోగుల విభజనపై అన్ని విభాగాల్లో మంజూరైన పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను సేకరించాలి. దిగువస్థాయి ఆఫీసు నుండి అత్యున్నత స్థాయి కార్యాలయం వరకు ఈ వివరాల సేకరణ పూర్తిచేయాలి. లోకల్‌, జిల్లా,జోనల్‌, మల్టీజోనల్‌, రాష్ట్ర స్థాయి పోస్టులగా వివరాలనే సేకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మార్చి ఒకటి, 2014 ప్రాతిపదికగా సీనియార్టీ వివరాలతో సహా ఈ వివరాలు సేకరించాలి. ఈ జాబితా ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు శాఖల వారిగా కేటాయింపు జరపాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా ప్రభుత్వాలకు 58.32, 41.68 నిష్పత్తి ప్రకారం అన్ని హెచ్‌ఓడిల్లోనూ రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియనుపూర్తి చేయాలి. అవసరమైతే ఉద్యోగుల విభజనకు సరైన ఇతర విధానాలను పనిభారం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించవచ్చు. రాష్ట్రస్థాయి పోస్టులను ఏ హోదాలో ఉన్న వారికి ఆ హోదా ప్రాతిపదికనే విభజించాలి. దిగువ స్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు పూర్తిచేసిన తాత్కాలిక ఉద్యోగుల విభజన జాబితాలను ఆర్థికశాఖకు, మానవనరుల విభాగంలో ఏర్పాటు చేసిన విభజన విభాగానికి అందచేయాలి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ శాఖల నమూనాను, కేటాయించిన ఉద్యోగుల వివరాలను సంబంధిత అధికారికి అందచేయాలి. వివిధ శాఖల ఉన్నతాధికారులు అందచేసిన వివరాలను సాధారణ పరిపాలన శాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. దీని ఆధారంగా నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఇదే విధంగా విభజన ప్రక్రియ జరగనుంది. యాజమాన్యాలు రూపొందించిన జాబితాను విభజన ప్రక్రియకు నియమించిన అధికారి ఆమోదించిన తరువాత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 
పథకాలు ... బాధ్యతలు ఆధారంగా బడ్జెట్‌
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న పథకాలు, ఆ సంవత్సరంలో పూర్తి చేయాల్సిఉన్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని కేటాయిస్తారు. ఈ మేరకు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ శాఖాధిపతులు రాష్ట్ర గవర్నర్‌కు ఈ నెల 30వ తేదిలోగా అందచేయాలి. పూర్తిస్థాయి సమీక్ష తరువాత ఈ మేరకు నిధులను గవర్నర్‌మంజూరు చేస్తారు. జూన్‌ రెండవ తేదినుండి ఈ కేటాయింపులు అమలులోకి వస్తాయి. 
స్థిర, చరాస్తుల పంపిణీ ఇలా
క్షేత్రస్థాయి వరకు వివిధ శాఖలకు ఉన్న స్థిర చరాస్తుల వివరాలు ఈ నెల 30వ తేదిలోగా అందచేయాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పంచాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి నిర్ధిష్ట వివరాలను తెలియచేయాలి. సంబంధిత అధికారి ఆమోదం పొందిన తరువాత సాధారణ పరిపాలన శాఖ ఏ రాష్ట్రానికి ఏ ఆస్థి చెందుతుందో పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. చరాస్తులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాల్సిఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత శాఖాధిపతులే సిద్దం చేసి 30వ తేదిలోగా సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలి. వీటిని పరిశీలించిన అనంతరం ఆదేశాలు జారీ అవుతాయి. ప్రభుత్వ వాహనాలను కూడా ఇదే విధంగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. 
నగుదు వివరాలు అందచేయాలి
వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ వద్ద ఉన్న నగదు వివరాలను పూర్తిస్థాయిలో అందచేయాలి. పిడి ఖాతాల్లో ఉన్న నిలువలను కూడా తెలియచేయాలి. ఆర్థికశాఖతో పాటు, సాధారణ పరిపాలన శాఖకు ఈ వివరాలను 30వతేదిలోగా అందచేయాలి. నిర్ధేశించిన నిష్ఫత్తి ప్రకారం ఈ మొత్తాన్ని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఆర్థికశాఖసిద్దం చేసే ఈ ప్రతిపాదనను పరిశీలించి జూన్‌ 1 వ తేది అర్ధరాత్రి నుండి రెండు రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు.

No comments: