MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, March 6, 2014

ACT NEWS : : 06-03-2014

16న టెట్‌
Posted on: Thu 06 Mar 00:34:08.522786 2014




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపిటెట్‌) రాతపరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈనెల 16వ తేదీన టెట్‌ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ (ఇసి) పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్‌ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. ఇసి అనుమతితో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4.49 లక్షల మంది అభ్యర్థులు హాజరవు తున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష కాకపోవడంతో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ నిర్వహించవచ్చని విద్యాశాఖ భావించింది. మరోవైపు పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతిని, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసి టెట్‌ నిర్వహించాలని విన్నవించారు. సిఎస్‌ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జి వాణీ మోహన్‌ మంగళవారం టెట్‌ నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎం జగదీశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన రోజే ఈనెల 16న టెట్‌ నిర్వహణకు సంబంధించిన అనుమతి ఇసి నుంచి లభించింది. 
ఏప్రిల్‌ 4న ఫలితాలు విడుదల చేస్తామని జగదీశ్వర్‌ తెలిపారు.
టెట్‌ నిర్వహణ కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1975 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తీసుకున్న హాల్‌టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయా? లేక కొత్త హాల్‌టిక్కెట్లు జారీచేస్తారా? అన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

No comments: