MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, October 2, 2013

కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట...

కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట..

  • పిడిఎఫ్, పోరాటం,రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు,
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. కాంట్రాక్టును వచ్చే సంవత్సరం మార్చి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు ఐదు లక్షల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంత ఊరట పొందనున్నారు. ఉద్యోగుల కొనసాగింపు కోసం పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడ రేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఎవి నాగేశ్వరరావు మాట్లాడారు. అనేక దఫాలుగా పోరాట ఫలితంగా ఐదు లక్షల కార్మికులకు కొంత ఊరట లభిచిందని, మార్చి వరకు మాత్రమే రెన్యువల్ చేయడం జరిగిందన్నారు. దీనిని తరువాత కూడా కొనసాగించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలని, డిఎ సౌకర్యం ఇవ్వాలని తాము కోరడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల వరకు వేతనాలు పెంచడం లేదని, ప్రతి సంవత్సరం వేతనాలు పెంచాలని కోరినట్లు తెలిపారు. అలాగే బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతిప్రతాలు ఇవ్వడం జరిగిందని ఎవి నాగేశ్వరరావు తెలిపారు.

No comments: