స్టాకహేోం :
క్లిష్టమైన రసాయన చర్యలను సులభంగా అవగాహన చేసుకోవడం, కొత్త ఔషధాల తయారీలో
పరిశోధకులకు సహాయకారిగా ఉండే కంప్యూటర్ నమూనాల అభివృద్ధికి నోబెల్ బహుమతి
లభించింది. అమెరికా, ఆస్ట్రియా పౌరసత్వం ఉన్న 83 ఏళ్ల మార్టిన్
కార్‌ప్లస్, బ్రిటన్, అమెరికా, ఇజ్రాయేల్ పౌరసత్వం ఉన్న 66 ఏళ్ల మైకేల్
లెవిట్, అమెరికా, ఇజ్రాయేల్ పౌరసత్వం ఉన్న 72 ఏళ్ల అరియె వార్షెల్‌లకు
2013 రసాయన శాస్త్ర నోబెల్ ప్రకటించారు. రసాయన పరిశోధనల్లో వీరి
కంప్యూటర్ నమూనాలు ఉపయోగకరంగా ఉంటాయని అవార్డు ప్రకటించిన రాయల్
స్వీడిష్ అకాడమీ తెలిపింది. 1970ల్లో వీరు చేసిన పరిశోధనల వల్ల ఆకుల్లో
జరిగే కిరణ జన్య ప్రక్రియ వంటివి తెలుసుకోవడం సుళు వైందని రాయల్ అకాడమీ
ప్రకటించింది. న్యూటన్ ప్రామాణిక భౌతిక శాస్త్రం, పరిమాణ భౌతిక శాస్త్రం
రెండింటితో రసాయన శాస్త్రవేత్తలు పని చేసేందుకు వీరు తయారు చేసిన
కంప్యూటర్ ప్రోగ్రాం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయన్నారు.
కార్‌ప్లస్ ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో, హార్వర్డ్
విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. లెవిట్ స్టాన్‌ఫోర్డ్
విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వార్షెల్ దక్షిణ కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. లెవిట్ మాట్లాడుతూ 'నాకు 20 ఏళ్ల
వయసులో పిహెచ్‌డి కూడా చేయకముందు చేసిన పనికి తనకు 46 ఏళ్ల అనంతరం
గుర్తింపు లభించిందన్నారు.
No comments:
Post a Comment